Ananda Lahari cultural association expressed angry at Ghazal Srinivas.
మహిళలను లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణపై కటకటాలు లెక్కిస్తున్న గజల్ శ్రీనివాస్‌పై దెబ్బ దెబ్బ పడుతోంది. ఆయనపై పలు సాంస్కృతిక సంఘాలు మండిపడ్డాయి. తన కార్యాలయంలో పనిచేసే ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన గజల్ శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని ఆనందలహరి సాంస్కృతిక సంస్థ డిమాండ్ చేసింది. కళను అడ్డంపెట్టుకొని మహిళల్ని లొంగదీసుకుంటున్న శ్రీనివాస్‌ను సామాజికంగా తమ సంస్థ బహిష్కరిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మిగతా కళా సంస్థలు కూడా గజల్ శ్రీనివాస్‌ను సామాజికంగా బహిష్కరించాలని ఆనందలహరి ప్రతినిధి సూచించారు. కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడటంపై ఆ సంస్థ అభ్యంతరం తెలిపింది.
గజల్ శ్రీనివాస్ కేసును నీరుగార్చేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆనందలహరి ప్రతినిధి. ఈ కేసును సమగ్రంగా విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆనందలహరి సంస్థ కన్వీనర్ మల్లం రమేశ్ అన్నారు.
గజల్ శ్రీనివాస్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ కళారంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని మల్లం రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కంటూ సాయన్న, చల్లా సరోజినీదేవి, సీనియర్ నటి ఆనందలక్ష్మి, రామడుగు వాసంతి, మోహన్కుమార్ గాంధీ, మిమిక్రి కళాకారులు రాంబాబు, జానపద నాయకులు బాలస్వామి, సాయిబాబా పాల్గొన్నారు.