అసలు ఎవరీ మహేష్ కత్తి?

Oneindia Telugu 2018-01-09

Views 1

Mahesh Kathi is a film critic and actor working in Telugu cinema. He appeared in the reality TV show Bigg Boss Telugu. He studied film theory in HCU.

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తెరిపి లేకుండా విమర్శలు చేస్తూ మహేష్ కత్తి వార్తల్లో వ్యక్తిగా మారారు. సినీ క్రిటిక్‌గా మాత్రమే ఆయన చాలా మందికి తెలుసు. సినిమాలను తన సమీక్షల ద్వారా కత్తి తీసుకుని నరుకుతాడని అందరూ అనుకుంటూ వస్తున్నారు. తాను అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నానని మహేష్ కత్తి చెబుతున్నప్పటికీ ఆయన ప్రధాన లక్ష్యం పవన్ కల్యాణ్ అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. పవన్ కల్యాణ్‌నే ఎందుకు లక్ష్యం చేసుకున్నాడనే విషయంపై ఎవరి అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే, కత్తి మహేష్ జీవితం ఏమిటనేది చాలా మందికి తెలియని విషయం.
మహేష్ కత్తి చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడంతో ఆయన పేరు చాలా వరకు వెలుగులోకి వచ్చింది. ప్రచారం కోసమే ఆయన పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారని చాలా మంది అనుకుంటున్నప్పటికీ పూనమ్ కౌర్‌ను కూడా లాగడంతో అది సీరియస్‌గా మారిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS