లవ్ జీహాద్ ఉచ్చులో పడొద్దంటూ బెదిరింపులు, యువతి ఆత్మహత్య, వీడియో

Oneindia Telugu 2018-01-09

Views 669

Constant warns by pro-Hindu activists pushed a 20-year-old woman in Karnataka to lost life herself for declaring that she loved Muslims. Dhanyashree was found lost life at her residence a day after a group of five pro-Hindu group workers warns her and her mother for "being friendly with Muslims".

బీజేపీ నాయకులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలోని మూడిగెరె ప్రాంతంలో జరిగింది. పీయుసీ (ఇంటర్) చదువుతున్న ధన్యశ్రీ (20) అనే యువతి తాను ముస్లీం యువకుడిని ప్రేమిస్తున్నానని బీజేపీ నాయకులు వేధించారని, తన వ్యక్తిగత విషయాలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారని, జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని డెత్ నోట్ రాసి పెట్టిందని చిక్కమగళూరు జిల్లా ఎస్పీ అన్నామలై మీడియాకు చెప్పారు.
నేను ఒక ముస్లీం యువకుడిని ప్రేమించడం పాపమా ? అంటూ ధన్యశ్రీ తన స్నేహితుడైన సంతోష్ అనే వ్యక్తికి సోషల్ మీడియాలో చాట్ చేసింది. ధన్యశ్రీ, సంతోష్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసిన ప్రైవేట్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ధన్యశ్రీ స్నేహితుడు సంతోష్ బజరంగ్ ధళ్ నాయకుడు. ధన్యశ్రీ సోషల్ మీడియాలో చాటింగ్ చేసిన విషయాలను సంతోష్ సోషల్ మీడియాలో అందరికీ షేర్ చేశాడు. లవ్ జీహాద్ ఉచ్చులో పడకూడదని సంతోష్ ధన్యశ్రీకి గట్టిగా హెచ్చరించాడు. హిందువులతో స్నేహంగా ఉండాలని, వారినే పెళ్లి చేసుకోవాలని ధన్యశ్రీకి సంతోష్ వార్నింగ్ ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS