సిరియాపై ఇజ్రాయెల్‌ జెట్‌ యుద్ధ విమానాల దాడి

Oneindia Telugu 2018-01-09

Views 253

Israel has launched on military targets in Syria, using jets and ground-to-ground missiles, the Syrian army has reported.

సిరియాపై తాజాగా ఇజ్రాయెల్ దాడి చేసింది. సిరియా వైమానిక శిబిరంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు ఝాము గం 2.40 నిమిషాలకి ఇజ్రాయల్ సిరియా సైనిక బలగాలపై దాడులు నిర్వహించిందని సిరియా తెలిపింది. కాగా సిరియా సైనిక బలగాలపై ఇజ్రాయల్ మిలటరీ చాలా రాకెట్స్ ని ప్రయోగించినట్టు తెలుస్తుంది. సిరియా సైనిక బలగాలపై క్షిపణి కాల్పులు మరియు వైమానిక దాడులు చేయడం ద్వారా టెర్రరిస్టులకు ఇజ్రాయెలీ సాయుధ బలగాలు స్ధిరంగా సహాయం చేస్తున్నారు అని సిరియా ఆరోపిస్తుంది. అయితే ప్రభుత్వ బలగాల చేతుల్లో టెర్రరిస్టు. మూకలు చావు దెబ్బ తింటూ ఓటమి ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి సహాయం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని సిరియా వ్యతిరేకాదికారులు చెప్పడం విశేషం. జెట్‌ యుద్ధ విమానాలు మరియు గ్రౌండ్ to గ్రౌండ్ మిస్సిల్స్ తో 3 సార్లు అటాక్ చేసారు. అయితే తమ భూభాగం మీదికి చొచ్చుకు వచ్చిన ఇజ్రాయెలీ ఫైటర్ జెట్ తో పాటు ఆ దేశానికి చెందిన ఒక క్షిపణి ని కూల్చివేశామని సిరియా తెలిపింది.
సిరియాలో ఐసిస్, ఆల్-నుస్రా టెర్రరిస్టుల తరపున ఇజ్రాయెల్ కూడా యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తేటతెల్లం అయింది. ఇజ్రాయెల్-సిరియా సరిహద్దులో సిరియా బలగాలపై ఫైటర్ జెట్ విమానాలతో బాంబు దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని సిరియా బలగాలు కూల్చివేశాయి. దానితో మధ్య ప్రాచ్యంలో టెర్రరిస్టు సంస్ధలు జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మద్దతు ఉన్నట్లు స్పష్టం అయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS