అమిత్ షా ఫైర్: కన్నడ అనువాదంతో తుస్

Oneindia Telugu 2018-01-11

Views 1K

BJP president Amit Shah’s speech at Holalkere district in Chitradurga, Karnataka was lost in translation on Wednesday. His monologue did not register with his n​o​n Hindi speaking audience.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద నిప్పులు చెరిగారు. సిద్దరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని, మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోలల్ కేరెలో పర్యటించిన అమిత్ షా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద హిందీలో తీవ్రస్థాయిలో విరుచుకుపడినా కన్నడ బాషలోకి అనువాదం చెయ్యడంతో అది తుస్సుమంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని అమిత్ షా ఆరోపించారు. భారత వ్యతిరేక సంస్థ అయిన సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్ డీపీఐ) మీద నమోదైన కేసులు ఎందుకు ఎత్తివేశారని బీజేపీ చీఫ్ అమిత్ షా సీఎం సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS