సంగీతను ఇంట్లో ఉండనివ్వాలి : కోర్టు తీర్పు

Oneindia Telugu 2018-01-11

Views 1.5K

Miyapur court judgement in Sangeetha case issue. Sangeetha Husband, suspended Telangana Rastra Samithi (TRS) leader Srinivas Reddy attended before court on Thursday.

గత యాభై రోజులకు పైగా బోడుప్పల్‌లోని భర్త ఇంటి ఎదుట సంగీత దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె భర్త, అత్తమామలు గురువారం మియాపూర్ ప్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.
సంగీత తన అత్తింటి వారిపై గతంలో కేసు పెట్టింది. తనపై వేధింపులు నిర్వహణ ఖర్చుల కోరుతూ కేసు పెట్టారు. దీనిపై మియాపూర్ కోర్టు తీర్పు చెప్పింది.
సంగీతను ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని మియాపూర్ కోర్టు భర్త శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించింది. అలాగే ఆమెకు నెలకు రూ.20వేలు నిర్వహణ ఖర్చు ఇవ్వాలని ఆదేశించింది.
అదనపు వరకట్న వేధింపులకు తోడు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త శ్రీనివాస్ రెడ్డి చిత్రహింసలకు గురిచేస్తూ సంగీతను ఇంటి నుంచి గెంటివేసిన విషయం తెలిసిందే. భార్య సంగీతకు తెలియకుండా మూడో వివాహం చేసుకున్నాడు. దీంతో గత ఏడాది నవంబర్ నెలలో బోడుప్పల్ సరస్వతి కాలనీలో భర్త ఇంటి వద్ద సంగీత నిరసన దీక్షకు దిగింది. సంగీతకు మద్దతుగా రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
కానీ సఫలం కాలేదు. దీంతో విసిగిపోయిన సంగీత ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించింది. భర్త శ్రీనివాస్ రెడ్డి, అత్త ఐలమ్మ, మామ బాల్‌రెడ్డిలు తనకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు. 50 రోజులుగా దీక్షలు చేస్తున్నా అత్తింటి నుంచి కాని, రాజకీయ పక్షాల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS