Mahesh Kathi tweets "Now that, AP is going to have high-court of its own. It's time for Rayalaseema people to fight to locate high-court of AP in Rayalaseema. Be it, Kurnool, Kadapa, Anantapur or Tirupathi".
తన ఫేస్‌బుక్ వ్యాఖ్యల ద్వారా, ట్వీట్ల ద్వారా వివాదాలు సృష్టిస్తున్న సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నట్లు కనిపిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వరుస వ్యాఖ్యలతో దుమారం రేపిన మహేష్ కత్తి ఈసారి రాజకీయ వ్యాఖ్య చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన వ్యాఖ్యను పోస్టు చేశారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన సమయంలో జరిగిన శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో దానికి ప్రాసంగికత ఒనగూరింది.ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ తన హైకోర్టును ఏర్పాటు చేసుకుంటోంది. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉది. కర్నూలు,, కడప, అనంతపురం, తిరుపతిల్లో ఎక్కడైనా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నందున హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనేది మహేష్ కత్తి అభిప్రాయంగా చెప్పవచ్చు. రాయలసీమలో ఇప్పటికే కొన్ని వర్గాలు రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ అనుభవాలను తెలుసుకునే క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావుల నుంచి రాయలసీమ మేధావులు, రచయితలు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి.