After Nayini Narsimha Reddy, Now MLA Srinivas Goud sensational comments on Telangana Chief Minister KCR's cabinet.
హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి తెలంగాణ కేబినెట్‌పై గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు అవి కలకలం రేపుతుండగానే, తాజాగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా ఆయనను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. నాయిని వ్యాఖ్యలు వంద శాతం నిజమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారని చెప్పారు. అది తలుచుకుంటే తన కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని చెప్పారు. కేసీర్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంటుందని చెప్పారు.
నాడు సీఎం కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కేబినెట్లో ఉన్నారని నాయిని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తిట్టినోళ్లు, తిట్టనోళ్లు ప్రస్తుతం ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని, తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీ నామరూపాలు లేకుండా చేయడానికే ఆ పార్టీకి చెందిన వారిని తెరాసలో చేర్చుకున్నామని కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు.
ఓ వైపు నాయిని మాటలు కలకలం రేపుతుండగానే మరుసటి రోజే శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హోంమంత్రి మాటలు వంద శాతం నిజమని చెప్పారు. ఉద్యమంతో సంబంధం లేని వారు మంత్రివర్గంలో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నేతలు, కేబినెట్ మంత్రులు వరుసగా ఇలా వ్యాఖ్యలు చేయడం కేసీఆర్‌కు తలనొప్పి అని చెప్పవచ్చు.
తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీలో ఉండి, ఆ తర్వాత తెరాసలో చేరిన మంత్రులు అయిన నేతలు పలువురు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, తుమ్మల నాగెశ్వర రావు, మహేందర్ రెడ్డి తదితరులు కొందరు ఉన్నారు. వీరిలో ఎవరిని ఉద్దేశించి చేశారనే చర్చ సాగుతోంది.