డీజిల్ చోరీ చేసి అతను కోట్లకు పడగలెత్తాడు..!

Oneindia Telugu 2018-01-16

Views 1.7K

The mystery behind Chengicherla oil tanker blast has been busted by Medipaly police.

ఇటీవల జరిగిన చెంగిచర్ల ప్రధాన రహదారి పక్కన ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనకు గల కారణం వెల్లడైంది. ఈ కేసులో నిందితులను మేడిపల్లి పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు కులాల్ రాజు, జగదీష్ అన్నదమ్ములు. వారి నంచి పది ట్యాంకర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 7.49 లక్షల నగదును, రెండు ద్విచక్ర వాహనాలను, కార్లను, మడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషీ అందుకు సంబంధించిన వివరాలను అందించారు.
ఈ సంఘటన ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాకినాడలో జరిగింది. పెట్రోల్ నింపుకున్న ట్యాంకర్ ఎస్ఆర్ నగర్‌కు వెళ్లి డెలివరీ చేయాల్సి ఉంది. అది చెంగిచర్లలో రాజు షెడ్డు వద్దకు వచ్ిచ ఆగింది. అక్కడ పెట్రోల్ తీస్తుండగా స్పార్క్ వచ్చి ప్రమాదం జరిింది. మేడిపల్లి రెవెన్యూ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు కులాల్ రాజు, కులాల్ జగదీష్‌లను అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. కదీర్, షర్ఫుద్దీన్, నయీం, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడగా, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS