52 people were in a bus fire in Aktobe region of Kazakhstan, Kazakh authorities said.
కజికిస్థాన్‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఇర్గిజ్ జిల్లాలో ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో 52 మంది మృత్యువాతపడ్డారు. ఒక్కసారిగా బస్సులో మంటలు లేవడంతో ఐదుగురు ప్రయాణికులు బస్సు నుంచి బయటికి దూకేసి ప్రాణాలు దక్కించుకోగలిగారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులోని మృతులంతా ఉజ్బెకిస్థాన్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా రష్యా నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.