పవన్ కు ప్రధాని గ్రీన్ సిగ్నల్.. ఆ ఇద్దరికి షాక్..!

Filmibeat Telugu 2018-01-23

Views 2.7K

Pawan Kalyan next project under Mayamall movie director Govindh lalam. This movie with political backdrop. Its sounding big project CHARITHRA. It got confirmed that AM Ratnam's surya movies will venture this project.

జనసేన అధినేత హోదాలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తెలంగాణలో తన పర్యటనను అట్టహాసంగా ప్రారంభించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఇక రాజకీయాలపైనే పవన్ దృష్టి సారించనున్నారనేది ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతున్నది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు సినిమాలు చేస్తారన్న వార్తలకు ఇక కాలం చెల్లినట్టే కనిపిస్తున్నది.
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత నిర్మాత ఏఎం రత్నం సారథ్యంలో రూపొందే చిత్రంలో పవన్ నటించాల్సి ఉంది. ఆ సినిమాకు చరిత్ర అనే టైటిల్‌ కూడా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం కోసం తమిళ దర్శకుడు నీసన్ కథను కూడా సిద్దం చేసినట్టు తెలిసింది.
ఇక ఏఎం రత్నం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాణ సారథ్యంలో సంతోష్ శ్రీనివాస్ దర్వకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ చిత్రం తమిళ సినిమాకు రీమేక్‌గా రూపొందనున్నదనేది టాక్. ఈ చిత్రమే ముందుగా సెట్స్‌పైకి వెలుతుందని ఈ మధ్య ఓ వార్త మీడియాలో షికారు చేసింది.
అయితే తెలంగాణ నుంచి రాజకీయ పర్యటనలు ఊపందుకొన్న నేపథ్యంలో పార్టీని మరింత విస్తృత పరిచే ఆలోచనతో పవన్ ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారట. అందుకే సినిమాలకు ఇక స్వస్తి అనే మాట ఆయన నోట్లో నుంచి వచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS