రాజ్ తరుణ్ మామూలోడు కాదు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Filmibeat Telugu 2018-01-23

Views 5

Film Nagar source said that, Raj Tharun take Rs. 3 Crores remuneration package for Kittu Unnadu Jagratha, Andha Gadu and Raju Gadu.

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదు, నటుడు కావాలనే తపన, అందుకు కావాల్సిన టాలెంటు తప్ప. ఇవన్నీ ఉన్నా కూడా అందరికీ అన్నీ కలిసి రావు. వేలల్లో ఒక్కరిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. అలాంటి అదృష్ట వంతుల్లో రాజ్ తరుణ్ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐదేళ్ల క్రితం 'ఉయ్యాలా జంపాల' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం టాలీవుడ్లో బాగా డిమాండ్ ఉన్న కుర్ర హీరోల్లో ఒకరిగా మారాడు.
2013లో ‘ఉయ్యాలా జంపాలా' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన రాజ్ తరుణ్ తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుని వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే యుత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తమావ, కుమారి 21 ఎఫ్ వరుస విజయాల తర్వాత..... అనిల్ సుంకర లీడ్ చేస్తున్న ఎకె ఎంటర్టెన్మెంట్స్ వారు రాజ్ తరుణ్ తో మూడు సినిమాలతో డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రాజుగాడు చిత్రాలు సైన్ చేశాడు. రెండు చిత్రాలు ఇప్పటికే విడుదలవ్వగా.... రాజుగాడు చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఎకె ఎంటర్టెన్మెంట్స్ వారు.... రాజ్ తరుణ్‌తో మూడు సినిమాలను రూ. 3 కోట్లతో డీల్ చేసుకున్నారట. అంటే ఒక్కో సినిమాకు రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నాడన్నమాట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS