సీఎం గా బాలకృష్ణ: అసలేం జరిగిందంటే..?

Oneindia Telugu 2018-01-25

Views 1.3K

Telugu DesamParty MLA Nandamuri Balakrishna has occupied Andhra Pradesh CM Nara Chandrababu Naidu's chair during a review meeting. but Officials said that MLA Nandamuri Balakrishna is not sits Andhra Pradesh CM Nara chandrababu's chair.

బుధవారం అమరావతిలో లేపాక్షి ఉత్సవాలపై సీఎం క్యాంపు కార్యాయలంలో సమీక్షను జరిపిన సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుర్చీలో కూర్చున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పష్టనిచ్చారు. ఈ సమావేశంలో బాలకృష్ణ కూర్చున్న కుర్చీ సీఎంది కాదని, కేవలం ఆ స్థానంలో ఉన్న మరో కుర్చీలో మాత్రమేనని చెప్పారు.
ఏపీ పరిశ్రమల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరైన సమావేశానికి ముందే, అక్కడ చంద్రబాబు కూర్చునే కుర్చీ తీసివేసి.. ఆ స్థానంలో మరో కుర్చీ వేసినట్లు తెలిపారు. అయితే, చంద్రబాబు స్థానంలో ఉన్న కుర్చీ కావడంతో అది సీఎం కుర్చీనని అందరూ పొరబడ్డారని వారంటున్నారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం పర్యటక, సాంస్కృతిక, రవాణా శాఖ అధికారులు, అనంతపురం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో లేపాక్షి ఉత్సవ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. లేపాక్షిలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కనీసం 20గదులకు తక్కువ కాకుండా వసతిగృహాన్ని నిర్మించాలని పేర్కొనగా.. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని పర్యటకశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా వెల్లడించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS