The state-wide bandh called by Karnataka organisations and farmers on 25 January is expected to affect life across the state and capital Bengaluru.
ట్రాకులపై నుండి మహిళలను లాగుతున్న పోలీసులు
మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో గోవా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం (జనవరి 25) కర్ణాటక బంద్ కు కన్నడ సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బెంగళూరు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
గురువారం జరుగుతున్న బంద్ కు మా మద్దతు ఉంటుందని, రైలురోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు కన్నడ సంఘ, సంస్థలు, కేఎస్ఆర్ టీసీ సంస్థ, డ్రైవర్లు సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించారు. మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో పొరుగు రాష్ట్రాలు అయిన గోవాలోని బీజేపీ- కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాదాయి నదీ నీటిని తీసుకు వచ్చి హుబ్బళి-దారవాడ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రజలకు తాగు నీరు అందించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి