Republic Day 2018 : పరేడ్ గ్రౌండ్స్‌లో ఎగిరిన జాతీయ జెండా, మరోపక్క బాబు దూరం

Oneindia Telugu 2018-01-26

Views 56

Andhra Pradesh CM Chandrababu Naidu not able to attend republic day celebrations on Friday due to flight delay.

గణతంత్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకాలేకపోయారు. దావోస్ నుంచి ఆయన గురువారం రాష్ట్రానికి బయలుదేరారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది. శుక్రవారం ఉదయం 7గంటలకు ఆయన అమరావతి రావాల్సి ఉండగా...అబుదాబిలో పొగమంచు కారణంగా విమానం ఆలస్యమైంది. దీంతో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు.
అక్కడ ఉన్న సిబ్బందికి ఆమె మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.
విజయవాడలోని ఇందిరా స్టేడియంలో గవర్నర్ నర్సింహన్ జెండా ఎగురవేశారు. అనంతరం భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఇక అంతకముందు : హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యావత్ దేశం గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ పండుగగా జరుపుకొంటున్నదని, ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో అమర వీరులను, త్యాగమూర్తులను స్మరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS