Writer Vijayendra Prasad is busy in script work for Rajamouli's next film with Ramcharan and NTR. Reports saying that, like Bahubali he writing a strong villain role in latest film.
బాహుబలి తర్వాత రాజమౌళి తదుపరి చిత్రమేంటి? అన్న దానిపై సినీ ఇండస్ట్రీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాంచరణ్-జూ.ఎన్టీఆర్ లతో ఆయన ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారన్న ప్రచారం జరుగుతున్నా.. దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ గురించే క్లారిటీ లేదంటే.. అప్పుడే ఈ సినిమా కథ గురించి కూడా ఊహాగానాలు మొదలైపోవడం గమనార్హం.
బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత తెరకెక్కింబోయే సినిమా కావడంతో రాజమౌళి ఎలాంటి కథను ఎంచుకోబోతున్నారన్న దానిపై అందరి చూపు నిలిచింది. బాహుబలితో వచ్చిన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. అన్ని వర్గాలకు నచ్చే కథను తయారుచేయమని ఇప్పటికే ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌ను పురమాయించారు. ప్రస్తుతం ఆయన అదే పనిలో నిమగ్నమయ్యారట.
ఇప్పటికే రాంచరణ్, ఎన్టీఆర్ ల పాత్ర ఎలా ఉండాలనే దానిపై ఒక అంచనాకు వచ్చారట. ఇక వీరిద్దరికి సరిసమానంగా ప్రతినాయకుడి పాత్రను తీర్చిదిద్దబోతున్నారట.
విజయేంద్రప్రసాద్ ఆ పాత్రను బలంగా తీర్చిదిద్దుతుండటంతో.. రానా లాంటి విలన్ పాత్రదారి కోసం వెతుకుతున్నారట.
విజయేంద్ర ప్రసాద్ తీర్చిదిద్దిన క్యారెక్టరైజేషన్స్ ఇప్పటికే రాజమౌళికి విపరీతంగా నచ్చాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, పేరున్న హీరోను గనుక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం ఎంచుకుంటే.. రాంచరణ్, ఎన్టీఆర్ లతో కలిపి మొత్తం ముగ్గురు హీరోలను తెరపై చూస్తామన్న మాట.