8 నెలల గర్భిణి ని ముక్కలుగా నరికి.... నార్త్ ఇండియన్ అన్న కోణంలో

Oneindia Telugu 2018-01-31

Views 237

Hours after the body of a woman was found chopped into several pieces and dumped in Hyderabad's Kondapur area on Tuesday, the police have confirmed that she was 8 months pregnant.

హైద్రాబాద్ కొండాపూర్‌లో ఓ మహిళ మృతదేహన్ని ముక్కలు ముక్కలుగా నరికి విడి బాగాలుగా చేసి గోనేసంచిలో కట్టి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేశారు. తల, కాళ్లు, చేతులు ఒక సంచిలో.. మొండెం మరొక సంచిలో మూటగట్టి రోడ్డు మీద పారేశారు!! అయితే ఆ మహిళ దాదాపు 8 నెలల గర్భిణి అని విచారణలో తెలిసినదంటున్నారు. గోనేసంచి నుండి రక్తం కారుతుండడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఈ గోనేసంచిని బొటానికల్ గార్డెన్ వద్ద వదిలి వెళ్లారని వాచ్‌మెన్ పోలీసులకు చెప్పారు. అయితే చెత్తను పారేసి వెళ్తున్నారని భావించినట్టు అనుమానించానని వాచ్‌మెన్ చెప్పారు. గోనె సంచిలో మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కోసి ఉంది. గోనెసంచిలో కాళ్ళు, చేతులు, తల, మొండెం వేరు చేసి ఉన్నాయని స్థానికులు చెప్పారు.మహిళ మృతదేహనికి గాజులు మాత్రం ఉన్నాయి. ఆ మూటలోనే ఆమె ధరించిన దుస్తులు ఎరుపు రంగు పైజమా, చాక్లెట్‌ రంగు కుర్తా, పగిలిన గాజులు, చెవి దిద్దులు ఉన్నాయి.
హత్యకు గురైన మహిళ ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయమై శ్రీరాంసాగర్ బొటానికల్ గార్డెన్ ప్రాంతానికి వచ్చే దారిలో ని సీసీ కెమెరా పుటేజీ విజువల్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ హత్య అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిందా? నిండు గర్భిణిని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే ఆమె డ్రెస్, గాజులను బట్టి.. ఆమె నార్త్ ఇండియా కి చెందిన మహిళ అయి ఉండొచ్చని భావిస్తున్నా రు. అక్కడి నుండి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తోందా లేదా ఏదయినా పనిమీద వచ్చి ఉంటుందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form