Union Budget 2018-19 : No importance to Telugu States And Jaitley ignored vizag railway zone in railway budget.
జైట్లీ నోట వినిపించని 'తెలుగు' రాష్ట్రాలు
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న 2018-19 బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని అమరావతికి భారీగా నిధులు, విశాఖ రైల్వే జోన్ తదితరాలతో పాటు రైల్వే ప్రాజెక్టుల విషయంలోను నవ్యాంధ్ర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్‌లో అమరావతి, పోలవరం ఊసు కనిపించలేదు. ఇది తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామమే అంటున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. 2019కి కలిసి ఉంటారా విడిపోతారా అనే చర్చ ఇప్పటికే సాగుతోంది.
ఇటీవల రైల్వే అధికారులు ఎంపీలతో సమావేశమై ప్రతిపాదనలు కోరారు. అయితే ఇంత ఆలస్యంగా ప్రతిపాదనలు తీసుకోవడం ఏమిటని ఎంపీలు రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు రైల్వే, అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సహా ఏపీ పలు డిమాండ్లు కేంద్రం ముందు పెట్టింది.