Boddupalli Srinivas case : సీఐ అదృశ్యం కేసులో ట్విస్ట్

Oneindia Telugu 2018-02-03

Views 1

Nalgonda Two Town CI Venkateswarlu was traced after 24 hours. Now he is in a resort near to Miryalguda it seems. 6 teams of police is in search operation. IG Stephen Ravindra announced that 'He is Safe'. On the other hand the family members of CI Venkateswarlu started to Nalgonda to meet him.

నల్గొండ టూటౌన్ పోలీస్‌ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యం కేసులో ట్విస్ట్ మీద ట్విస్టులు వెలుగులోనికి వస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి సీఐ వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు సీఐ వెంకటేశ్వర్లు.. జనవరి 24న జరిగిన నల్గొండ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో విచారణాధికారిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆయన అదృశ్యమైనట్లు తెలుస్తోంది. అదృశ్యమైన 24 గంటల తరువాత నల్గొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించింది. ఆయన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సమీపంలో ఓ రిసార్టులో ఉన్నారని, కాసేపట్లో ఆయన నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముందు హాజరవుతారంటూ వార్తలు వెలువడ్డాయి.
నల్గొండ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో నిందితులకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వారికి బెయిల్ వచ్చిన మరుసటి రోజు అంటే శుక్రవారం నుంచే ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యం కావడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ విషయంలో నిందితులకు సంబంధం ఉండి ఉంటుందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
శుక్రవారం ఉదయం మాడ్గులపల్లి పోలీసుస్టేషన్‌లో డిపార్ట్‌మెంట్‌ సిమ్‌కార్డును ఇచ్చేసిన సీఐ... పర్సనల్ ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. అలాగే తన సర్వీస్ రివాల్వర్‌ను ఆయన తన డ్రైవర్‌కు అప్పగించి వెళ్లిపోయారు. సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యంపై ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 24 గంటలు దాటినా ఆయన ఆచూకీ లభించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. సీఐ వెంకటేవ్వర్లు ఆచూకీ కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS