Motilal, who was Accused in BTech graduate Anusha case accepted his crime
తీవ్ర సంచలనం సృష్టించిన బిటెక్ గ్రాడ్యుయేట్ అనూష హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడే ఆమెను బండరాయితో మోది చంపాడని తేలింది. హైదరాబాదులోని హయత్ నగర్ సమీపంలో ఇటీవల అనూష హత్య జరిగిన విషయం తెలిసిందే. అనూష తల్లిదండ్రులు అనుమానించినట్లుగానే ఆమె ప్రియుడు మోతీలాల్ ఈ హత్యకు పాల్పడ్డాడు. ఆమెపై అనుమానం పెంచుకున్న నాగర్ కర్నూలుకు చెందిన మోతీలాల్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మోతీలాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అనూషపై అనుమానంతోనే తాను ఆమెను చంపేసినట్లు మోతీలాల్ చెప్పాడు. అనూష తాను 2013 నుంచి ప్రేమించుకుంటున్నట్లు అతను తెలిపాడు. బిటెకి గ్రాడ్యుయేట్ అనూష హత్య కేసులో ఆమె ప్రియుడు మోతీలాల్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమ ప్రేమను తమ ఇంట్లో అంగీకరించకపోయినా అనూష ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నామని అతను చెప్పాడు. అనూష చదువు ఖర్చులు కూడా తానే భరించానని చెప్పాడు.
గత కొద్ది రోజుల్లో అనూష ప్రవర్తనలో మార్పు వచ్చిందని మోతీలాల్ చెప్పాడు. అనూష ఫోన్ పరిశీలిస్తే చాలా మందితో చాటింగ్ చేసినట్లు బయటపడిందని, తన స్నేహితుడు కూడా ఆమెతో చాటింగ్ చేయడంతో తనకు అనుమానం పెరిగిందని అన్నాడు.