Leg-spinner Chahal picked up his maiden five-wicket haul to finish with figures of five for 22 and left-armer Yadav took three for 20. Shikhar Dhawan and Virat Kohli guided India to a comprehensive nine-wicket victory over South Africa in the 2nd ODI.
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత్‌కు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. సెంచూరియన్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఏకపక్షంగా సాగిన జరిగిన రెండో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోహ్లీసేన 20.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి చేధించింది. చాహల్, కుల్దీప్ యాదవ్‌లు పోటీ పడి మరీ వికెట్లు తీశారు. సఫారీ బౌలర్లు మోర్కెల్(1), మోరిస్(14)ను ఔట్ చేసి చాహల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. చాహల్, కుల్దీప్‌ల దెబ్బకు దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోవడం విశేషం. దీంతో 32.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం.