Telugu Desam MP of Guntur Galla Jayadev said that the AP public are ridiculing the Centre for making very poor allocation to the state in the Union budget, much less than the collection of Baahubali movie.
ఏపీ ప్రజలను పూల్స్ కారని, ప్రతీసారీ ఏపీ ప్రజలను మోసం చేయలేరని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే రకంగా నిధుల కేటాయింపు కొనసాగితే మిత్రులుగా కొనసాగడం కష్టమని గల్లా జయదేవ్ ప్రకటించారు.ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీకి నిధులను కేటాయించాలని టిడిపి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు కొనసాగిస్తున్నారు.అయితే బుదవారం సాయంత్రం ఏపీకి చెందిన టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏపీకి నిధుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానంపై గల్లా జయదేవ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జయదేవ్ ఏపీకి జరిగిన అన్యాయంపై సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చని విషయాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంశాలవారీగా తన ప్రసంగంలో ప్రస్తావించారు. విభజన చట్టంలోని 19 అంశాల్లో ఒక్క హమీని కూడ నెరవేర్చలేదని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కేటాయిస్తోందని చెప్పారు. అడ్డగోలు విభజన వల్ల తీవ్రంగ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత నాలుగేళ్ళలో బీజేపీ సర్కారు సర్కారు ఇచ్చిన నిధుల కంటే.. తెలుగు 'బాహుబలి' వసూలు చేసిన కలెక్షన్లే అధికంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు తాను అనడం లేదనీ తమ రాష్ట్ర ప్రజలు జోకులు వేసుకుంటున్నారంటూ మండిపడ్డారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే మిత్రులుగా కొనసాగడం కష్టమేనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టమేనని గల్లా జయదేవ్ ప్రకటించారు. కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదని చెప్పడం సరైందికాదన్నారు. ప్రతి నివేదికను కేంద్రానికి సమర్పించినట్టు గల్లా జయదేవ్ ప్రకటించారు.