Telangana Congress leaders took strong objection to the ‘Loafer’ and ‘Pappu’ comments made by IT Minister K.T. Rama Rao referring to the Congress and its president Rahul Gandhi.
కేటిఆర్ మీడియాతో కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద తీవ్రమైన కామెంట్స్ చేశారు. డానికి ఈరోజు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కేటిఆర్ తిట్లకు తిట్లతోనే సమాధానం చెప్పారు. తెలంగాణలో కేసిఆర్ ఫ్యామిలీ ని మించిన చీటింగ్ ఫ్యామిలీ లేదన్నారు. తెలంగాణ అధికార-ప్రతిపక్షాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. నిత్యం రాజకీయ సవాళ్లు, విమర్శలతో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఐటీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి 'లోఫర్' అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద చిచ్చే పెట్టాయి. కాంగ్రెస్ నుంచి దీనిపై పెద్ద ఎత్తున ప్రతిఘటన మొదలైంది. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను తగలబెట్టిన కాంగ్రెస్ నాయకులు.. తమ నోటికి మరింత పని చెబుతున్నారు. మాట్లాడాలంటే.. మేమూ మాట్లాడగలం. కాంగ్రెస్ లోఫర్ అన్నప్పుడు... ప్రతిగా టీఆర్ఎస్ పార్టీని బ్రోకర్ పార్టీని అని ఎవరైనా అంటే?.. కేవలం మీడియాలో హైలైట్ అవడం కోసమే కేసీఆర్, కేటీఆర్ ఈవిధంగా రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ మా కాంగ్రెస్ నాయకులను మాత్రం అసభ్య పదజాలం వద్దని నేను సూచిస్తున్నా.