SpaceX's Falcon Heavy Landing

Oneindia Telugu 2018-02-09

Views 288

Watch Landing of the Spacex Falcon Heavy outboard boosters and SpaceX's Falcon Heavy launch

ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్ ఎక్స్' మంగళవారం విజయవంతంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ 'ఫాల్కన్ హెవీ'ని అంతరిక్షంలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం అనంతరం స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రశంసించారు.
ఈ ప్రయోగం అనంతరం రెండున్నర నిమిషాలకు ఫాల్కన్ హెవీ రాకెట్‌కు అమర్చిన రెండు బూస్టర్లు విడిపోయి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. మరో బూస్టర్ సముద్రంలోని డ్రోన్ షిప్‌పైకి వచ్చి చేరాల్సి ఉండగా, అలా జరగలేదు. ఈ బూస్టర్ విఫలమై కాలిపోయినట్లు తరువాత స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌ను తయారు చేయడమేకాకుండా దాని ద్వారా ‘రోడ్ స్టర్' అనే ఓ టెస్లా కారును స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి పంపించిన సంగతి తెలిసిందే. ఈ కారును అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టాలనేది స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ లక్ష్యం. అయితే ఇప్పుడు ఈ లక్ష్యం నెరవేరకుండా పోయింది.
స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ లక్ష్యం విఫలమైంది. ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశించిన టెస్లా కారు ‘రోడ్ స్టర్' సరైన కక్ష్యలోకి ప్రవేశించలేదు. తొలుత ప్రయోగం విజయవంతం అయిందని సంస్థ ప్రతినిధులు, స్పేస్ సైంటిస్టులు భావించారు. కానీ ఆ తరువాత అసలు విషయం తెలిసింది. అదేమిటంటే.. ఫాల్కన్ హెవీ రాకెట్ ఈ కారును అంగారక గ్రహ కక్ష్యలో కాకుండా దానికి అవతలున్న ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS