In a recent interview, Manjula had confessed that she wants to direct Powerstar Pawan Kalyan.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను దాదాపుగా వదిలేశారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో బిజీ అయ్యారు. 2019 ఎన్నికల వరకు ఆయన సినిమాల వైపు చూసే అవకాశం లేదు. ఆ తర్వాత కూడా డౌటే... ఎందుకంటే అపుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసిన తర్వాత మహేష్ బాబు సోదరి మంజుల ఓ సంచలన ప్రకటన చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తాను ఒక కథ రాసుకున్నాను అని, ఈ చిత్రానికి ‘పవన్' అనే టైటిల్ కూడా పెట్టుకున్నట్లు మంజుల తెలిపారు. మంజుల ఈ ప్రకటన చేయడంతో అందరిలోనూ ఆశ్చర్యం నెలకొంది. పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తున్నాను అని గతంలో చెప్పారు.... దాని సంగతి ఏమైంది? అనే ప్రశ్నకు మంజుల ఈ విధంగా స్పందించారు.
మా నాన్నగారు, నా సోదరుడు మహేష్ తర్వాత నేను మెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, మనసు ఏది చెబుతుందో అదే చేస్తారు, నిజాయతీ కలిగిన వ్యక్తి అంటూ మంజుల కొనియాడారు. తన తాజా మూవీ ‘మనసుకు నచ్చింది' ప్రమోషన్లో మంజుల ఈ కామెంట్స్ చేశారు.
నేను రాసుకున్న కథ పవన్ కళ్యాణ్ ఒక్కసాకరి వింటే చాలు, ఆయనకు ఈ కథ తప్పకుండా నచ్చుతుంది. ఆయన ఈ కథను కాదనలేరు. అంతగొప్పగా ఉంటుంది అంటూ మంజుల మీడియా ముఖంగా ప్రకటన చేశారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు చేయరని నాకు తెలుసు. కానీ, ఈ ఒక సినిమా చేసి ఆయన రాజకీయాల్లోకి వెళ్లొచ్చు. కథ వినమని ఆయనకు చెప్పండి అంటూ...మీడియా ప్రతినిధులు ఉద్దేశించి మంజుల వ్యాఖ్యానించారు.