YSR Congress Rajya Sabha MP Vijay sai Reddy has blamed Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chandrababu Naidu. And he supports bjp over Poll Promises
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి బిజెపికి వత్తాసు పలికినట్లు కనిపిస్తున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యానికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయని అంటున్నారు. తన వైఫల్యాలను చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీఎ సర్కారుపై రుద్దుతున్నారని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానిింాచరు. ఎపికి అన్యాయం జరుగుతున్నా కూడా నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్నది చంద్రబాబు కాదా అని ఆయన అడిగారు.
రాజకీయ ప్రయోజనం కోసమే తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో గొడవ చేశారని విజయసాయి రెడ్డి అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఎపి ప్రయోజనాల కోసం తమ పార్టీనేతలు పోరాటం చేస్తూనే ఉన్నారని, కానీ అధికార టిడిపి నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విజయ సాయి రెడ్డి అన్నారు. కేవలం పార్టీ ప్రయోజనాల కోసం పార్లమెంటులో తాు కూడా పోరాడినట్లు టిడిపి ఎంపీలు వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఓ ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో భాగంగానే తాము అందరినీ కలుస్తున్నామని, సిఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఈసిని కలుస్తామని విజయ సాయిరెడ్డి చెప్పారు