Maha Shivratri 2018 : The 12 Jyotirlingas Of Shiva

Oneindia Telugu 2018-02-13

Views 4

A Jyotirlinga is a shrine where Lord Shiva is worshipped in the form of a fiery column of light. ‘Jyoti’ means ‘radiance’ and Lingam, the Shiva Lingam-‘the mark or sign’ of the Almighty or the phallus symbol

సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి.అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము.
మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వది కాలం. కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేలుకొని భక్తితో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది.ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్య ప్రదమైన రోజు.మహశివరాత్రిని హిందువులు ఏంతో గొప్పనైన పర్వదినంగా జరుపుకొని శివున్ని కొలిచి తరిస్తారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి 1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.
భక్తులు శివున్ని మూర్తి రూపములో మరియు లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం.అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది.
శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కధ ఉంది.ఒకసారి బ్రహ్మ,విష్ణువుల మధ్య మాట మాట పెరిగి తమలో ఎవరు గొప్పో అని తేల్చుకోవలనుకున్నారు.వీరి వాదన తారాస్థాయికి చేరింది.ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘ మాస చతుర్ధశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ,విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆశివుని యొక్క ఆది,అంతం తెలుసుకోవలని విష్ణువు వరాహ రూపం ధరించి అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు.మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క ఆది,తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలసి శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు వారిలో ఎవరు గోప్ప అనే పోటితో వాదనతో ఉన్నదానిని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు.దానితో బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు.ఆరోజే మహాశివరాత్రి అయినదని పురాణ కధనం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS