Hashim Amla has been run out by Hardik Pandya, and has to walk back to the pavilion after scoring 71. This is a huge turning point in the game
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ విజయానికి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాయే కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సఫారీ పర్యటనలో తొలి టెస్టులో బ్యాట్‌తో మెరిసిన పాండ్యా ఆ తరువాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. ఆరు వన్డేల సిరిస్‌లో కూడా అటు బౌలింగ్‌తో పాటు ఇటూ బ్యాటింగ్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. అయితే మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా అద్భుతమైన ఫీల్డింగ్‌తో మెరిశాడు. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా.. సఫారీ జట్టుని విజయపథంలో నడిపిస్తోన్న వేళ హార్దిక్ పాండ్యా అద్భుతం చేశాడు.
తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో డైరెక్ట్ త్రో విసిరి ఆమ్లా(71)ను రనౌట్ చేశాడు. దీంతో ఐదో వన్డేలో భారత్ విజయం మరింత సులువైంది. భువనేశ్వర్ వేసిన 35 ఓవర్ రెండో బంతికి ఆమ్లా మిడాఫ్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పాండ్యా బంతి వికెట్లకు తాకి బెయిల్స్ ఎగిరి లైట్లు వెలిగిన మిల్లీ సెకన్ల వ్యవధిలోనే ఆమ్లా బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు.
అదృష్టం ఈసారి భారత్‌ను వరించడంతో.. బెయిల్స్ గాల్లోకి లేచే సమయానికి బ్యాట్ అంచు మాత్రమే క్రీజు గీతపై ఉంది. అన్ని కోణాల్లో పరిశీలించిన అంపైర్ ఆమ్లాను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఆమ్లా పెవిలియన్ చేరాడు. భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. అంతకు ముందు రహానే క్యాచ్ జారవిడచడం, అంపైర్ తప్పిదం కారణంగా రెండుసార్లు జీవదానం పొందిన ఆమ్లా 71 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ఆమ్లా అవుట్ కాకుంటే భారత్ విజయానికి చాలా కష్టమయ్యేదని, పాండ్యా సూపర్ ఫీల్డింగే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు