Virat Kohli becomes the first batsman to cross 500 runs in a ODI series. Virat Kohli scored his 35th ODI century today. Virat Kohli took his 100th ODI catch.
కోహ్లీ కోహ్లీ కోహ్లీ ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరే. ఎందుకంటే చరిత్ర రాసాడు మరి కోహ్లి. గతంలో ఎన్నడూ లేని రీతిలో టీమిండియా చెలరేగిపోవడానికి కారణం కోహ్లీ. టీమిండియా వరుస సిరీస్‌ల్లో విజయం సాదించాడానికి కారణం కోహ్లీ . తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఓ సిరీస్‌ను టీమిండియా చేజిక్కించుకోవడానికి కారణం కోహ్లీ.
పరుగుల యంత్రంగా పేరొందిన విరాట్ ధాటికి సఫారీ బౌలర్లు కూడా చేతులెత్తేశారు. మా పిచ్ మీద ఆడలేడు అని దీమా వ్యక్తం చేసినంత సేపు పట్టలేదు. అంతలా చెలరేగిపోయిన విరాట్ ఈ సిరీస్‌లో పలు రికార్డులను నెలకొల్పాడు.
ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లి, దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో సెంచరీతో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా 13వ వన్డే శతకాన్ని సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు కొట్టిన ఓవరాల్ కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్(13), కోహ్లీ(13) సెంచరీల తో రెండో స్థానంలో నిలవగా, కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన వారిలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్(22) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇక గతంలో ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని అరుదైన ఘనతను విరాట్ కోహ్లీ సాధించాడు. 1992 నవంబరు నుంచి ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో విజయం కావాలనే పాతికేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఆరు వన్డేల సిరిస్‌ను 5-1తో కైవసం చేసుకుని సఫారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.