ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య వెనుక ఇన్ని కోణాలా ?

Oneindia Telugu 2018-02-20

Views 1

A Master of Business Administration (MBA) student lost life in her hostel room at Kompally while on a video call with her boy friend late on Saturday.

హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన అనీషా చౌదరి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె తన పాత బాయ్ ఫ్రెండ్ వివాహానికి వెళ్లాలనుకోవడం.. ప్రస్తుత బాయ్ ఫ్రెండ్‌కు ఎక్కడ కోపం తెప్పిస్తుందోనన్న కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్దారించారు. ఆత్మహత్యలో ఇంకెవరి పాత్ర లేదని తేల్చారు.
కొంపల్లిలోని శివశివానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది అనీషా చౌదరి(24). ఆమెకు గతంలో అనంతపురానికి చెందిన ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇటీవలే అతని పెళ్లి కూడా కుదరడంతో అనీషాను ఆహ్వానించాడు. పెళ్లికి వెళ్లాలా? వద్దా? విషయమై తర్జనభర్జన పడ్డ అనీషా.. విషయాన్ని ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ దక్షేశ్‌ పటేల్‌కు తెలిపింది.
దక్షేశ్ పటేల్ కూడా ఆమెకేమి అభ్యంతరం చెప్పలేదు. అనీషా పెళ్లికి వెళ్తానని అడగ్గానే వెళ్లమని చెప్పాడు. కానీ ఆ తర్వాత లేనిపోని అపోహలతో ఆమె సతమతమైంది. పెళ్లికి వెళ్తే దక్షేశ్ పటేల్ తనను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడోనని తనలో తానే ఆవేదన చెందింది.
పైగా హాస్టల్ గదిలోనూ ఆరోజు అనీషా ఒక్కరే ఉండటం కూడా ఆమెను మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమెతో పాటు ఉండే స్నేహితురాలు అంతకు ముందురోజే ఊరెళ్లడంతో గదిలో అనీషా ఒంటరిగా ఉంది. అదే క్రమంలో ఈ ఆలోచనలన్ని చుట్టుముట్టడంతో బాగా కుంగపోయింది. చివరకు అదే రోజు రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS