Dhoni has brought all his experience into play, anticipating the batsman’s intentions and recognising his strengths and weaknesses to direct the bowlers to bowl a particular line and length.
ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. బ్యాట్స్‌మెన్ మైండ్‌ను చదవడంలో దిట్ట. వికెట్ల వెనక నుంచి బౌలర్లకు సలహాలు ఇస్తూ భారత జట్టుకు ఎన్నో విజయాలనందించాడు.
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాండ్యాకు బౌలింగ్ ఎలా వేయాలో ధోని సూచనలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని డేవిల్ మిల్లర్ ఎదుర్కొన్నాడు.
ఆ తర్వాత రెండో బంతిని ఎలా వేయాలో వికెట్ల వెనుక ఉన్న ధోనీ.. పాండ్యాకు సైగల ద్వారా చూపించాడు. ధోని ఎలా చెప్పాడో పాండ్యా ఆ బంతిని అలాగే వేశాడు. పాండ్యా బంతిని ఎదుర్కొన్న మిల్లర్ అమాంతం దానిని గాల్లోకి లేపాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ధావన్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ పెవిలియన్‌కు చేరాడు.
ఈ వీడియోని చూసిన అభిమానులు ధోని ఏం చెప్పాడో పాండ్యా అలాగే బౌలింగ్ చేసి చూపించాడని మెచ్చుకుంటున్నారు. కాగా, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా బుధవారం జరగనుంది.