జైపూర్/లక్నో: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ శాఖల్లో విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మరణించగా, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రాజస్థాన్ ఎమ్మెల్యే కన్నుమూశారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్, రాజస్థాన్‌లో కళ్యాణ్ సింగ్ అనే మరో బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం మృతి చెందారు. వీరి మృతి పట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.