Ileana Comments On Pawan Kalyan

Filmibeat Telugu 2018-02-21

Views 638

Actress Ileana comments about tollywood films for treating her as a glamour doll in Aata & Devadas & commented positivelty on pawan kalyan & ravi teja movies.

దేవదాసు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనా ఇలియన మంచి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అయితే తాజాగా ఇలియానా సౌత్ సినిమాలపై ప్రత్యేకించి టాలీవుడ్ పై చేసిన వాఖ్యలు వివాదంగా మారుతున్నాయి.ఆమె నటించిన తొలి చిత్రం దేవదాసుపై విమర్శలు గుప్పించిన ఇలియానా సిద్దార్థతో నటించిన ఆట చిత్రంపై కూడా విమర్శలు చేసింది. అలాగే టాలీవుడ్ లో ఆమె నటించిన చిత్రాల్లో గుర్తుంచుకోదగ్గ చిత్రాలు రెండు ఉన్నాయట.
ఇటీవల ఇల్లియన మాట్లాడుతూ "తాను నటించిన తొలి చిత్రం దేవదాసు మొదలుకొని వరుసగా అదే తరహా పాత్రలు వచ్చాయి. పోకిరి, ఖరత్నాక్ మరియు తమిళ చిత్రం కేడి లో తనని ఓ గ్లామర్ వస్తువుగా మాత్రమే చూస్తారు.తనని ఓ గ్లామర్ వస్తువువగా మాత్రమే చూశారు అని చెప్పడానికి ఆట చిత్రం పరాకాష్ట.వరుసగా అదే తరహా పాత్రలు వస్తుండడంతో సౌత్ లో సినిమాలకు స్వస్తి చెప్పాలని అనిపించినట్లు ఇలియానా తెలిపింది.
టాలీవుడ్ చిత్రాలతో విసిగిపోతున్న తరుణంలో జల్సా చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చిందని, తన కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ చిత్రాలలో జల్సా చిత్రం ఒకటని ఇలియానా తెలిపింది.రవితేజ సరసన నటించిన కిక్ చిత్రాన్ని కూడా తాను మరచిపోలేనని తెలిపింది. జల్సా, కిక్ చిత్రాలు తనకు ప్రత్యేకమైనవిగా చెప్పుకొచ్చింది.

Share This Video


Download

  
Report form