Kamal Haasan on Wednesday launched his political party Makkal Needhi Maiam ( justice for people) in the presence of Delhi chief minister Arvind Kejriwal and others, said he would devote the rest of his life to the people.
నటుడు కమల్ హాసన్ తన కొత్త పార్టీని బుధవారం సాయంత్రం మధురై వేదికగా ప్రకటించారు. పార్టీ పేరు 'మక్కళ్ నీది మయ్యం'. దీని అర్థం జస్టిస్ ఫర్ పీపుల్. అంటే ప్రజలకు న్యాయం. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ పేరు ఆవిర్భావానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. భారీగా అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడారు. తాను జనంలో నుంచి వచ్చిన వాడిని అని, తలైవాను కాదన్నారు.
తాను నాయకుడిని కాదని, మీలో ఒకడిని అని కమల్ హాసన్ అన్నారు. ప్రజలకు సలహాలు చెప్పే నాయకుడిని కాదని, ప్రజల నుంచి సలహాలు తీసుకునే వాడిని అని చెప్పారు. ఈ ఒక్క రోజుతోనే కార్యక్రమం ఆగిపోదన్నారు. ఒక్క రోజు కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు.
తాను నాయకుడిని కాదని, మీ చేతిలో ఉపకరణాన్ని అని కమల్ హాసన్ చెప్పారు. మీకు సేవ చేసేలా నాకు దిశా నిర్దేశనం చేయాలని ప్రజలను కోరారు. ఒక్క రోజు ఆట కోసం నేను రాజకీయాల్లోకి రాలేదన్నారు. నేను ఆయుధంలాంటి వాడిని అని, పార్టీ నేతను కాదన్నారు.
రాజకీయాల్లో తనకు దీర్ఘకాలిక లక్ష్యం ఉందని కమల్ హాసన్ చెప్పారు. మధురై ఒత్తకడై మైదానంలో విలక్షణ నటుడు పార్టీ పేరును ప్రకటించిన సమయంలో అభిమానులు కేరింతలు కొట్టారు.
కమల్ హాసన్ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. తెలుపు రంగు జెండాలో ఎరుపు, తెలుపు రంగులు కలిసిన జెండాను ఆవిష్కరించారు. ఒక చేతి మణికట్టుని మరో చేయి పట్టుకుని ఉన్న ఆరు చేతులు, అందులో మూడు ఎరుపు రంగులో, మరో మూడు తెలుపు రంగులో ఉన్నాయి. వాటి మధ్యలో తెల్లని నక్షత్రం ఉంది.