JP Duminy and Heinrich Klaasen took the game away from India. South Africa defeat India by six wickets in Centurion to level the three-match T20 series 1-1.
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టీ20లో సఫారీ జట్టు పుంజుకుంది. సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఆ జట్టు ఘన విజయం సాధించింది. ధోనీ హాఫ్ సెంచరీ జట్టుకు బలం చేకూర్చలేకపోయింది. 189పరుగుల లక్ష్యంతో అడుగుపెట్టిన సఫారీలు క్లాసన్‌తో పాటు డుమిని విరుచుకుపడడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వాతావరణం కూడా బాగానే కలిసొచ్చి సఫారీలకు లక్ష్య చేధనలో అడ్డు లేకుండా పోయింది. చివరిదైన మూడో టీ20 శనివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది. భారత బ్యాట్స్‌మెన్‌లైన ప్రధాన వికెట్లు 38 పరుగులకే రెండు వికెట్లు పడిపోయాయి. యథావిధిగా రోహిత్ వచ్చిన కాసేపటికే వెన్నుచూపి పెవిలియన్ చేరుకుంటే, విరాట్ కోహ్లీ సైతం కేవలం 1 పరుగుకే పరిమితమై క్రీజును వదిలిపెట్టాడు. అనంతరం వచ్చిన మనీష్ పాండే 6 ఫోర్లు, 3 సిక్సులతో (79), ధోని (52) తీవ్రంగా శ్రమిస్తే భారత జట్టు 4 వికెట్ల నష్టంతో 188 పరుగులు సాధించింది.
తక్కువ స్కోరుకే మూడు కీలక వికెట్లు కోల్పోయినా భారత్ భారీ స్కోరు చేసిందంటే ప్రధాన కారణం మనీష్ పాండే, ధోనీల మెరుపులే. విధ్వంసక బ్యాటింగ్‌తో ఐదో వికెట్‌కు 98 పరుగుల అభేద్య భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జంట దక్షిణాఫ్రికాకు మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది.
సౌతాఫ్రికా ఓపెనర్ హెన్‌డ్రిక్స్ (26) మెరుపులతో భారీ ఛేదనను ధాటిగానే ఆరంభించింది. అయితే, మరో ఎండ్‌లో పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డ స్మట్స్ (2)ను ఉనాద్కట్, తర్వాతి ఓవర్లో హెన్‌డ్రిక్స్‌ను శార్దూల్ అవుట్ చేయడంతో ఆతిథ్య జట్టు 38/2తో వెనుకంజ వేసింది. కానీ, ఉనాద్కట్ వేసిన తర్వాతి ఓవర్లోనే రెండు సిక్సర్లు కొట్టిన క్లాసెన్ సఫారీలపై ఒత్తిడి తగ్గించాడు. ఆ వెంటనే చాహల్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కొట్టాడతను. మరో ఎండ్‌లో కెప్టెన్ డుమిని క్రీజులో పాతుకుపోయాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ క్లాసెన్‌కు సహకారం అందించాడు. స్వేచ్ఛగా ఆడిన క్లాసెన్ స్పిన్నర్ చాహల్ లక్ష్యంగా చేసుకొని స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. దాంతో, ఆ ఓవర్లోనే సఫారీల స్కోరు వంద దాటగా.. పాండ్యా బౌలింగ్‌లో బౌండ్రీతో క్లాసెన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.