Sai Dharam Tej one of the energitic hero in Tollywood.But he got succes after few films. After Intelligent flop, Sai Dharam Tej speak to a youtube channel.
సాయిధరమ్ తేజ్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో ఎనర్జిటిక్ హీరో అని పేరు తెచ్చుకొన్నారు. కెరీర్ ఆరంభంలో సాయిధరమ్‌ను ఫెయిల్యూర్స్ పలకరించాయి. ఆ తర్వాత సక్సెస్‌లు వెంట నిలిచాయి. తాజాగా ఇంటిలిజెంట్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ చానెల్‌తో సాయిధరమ్ తేజ్ మాట్లాడారు. త న ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను సాయిధరమ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
నా కెరీర్ ఆరంభంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. హీరోను కావడానికి నేను నా ఫ్యామిలీ పేరును వాడుకోవద్దను కొన్నాను. ఆడిషన్స్ కోసం వెళ్లాను. నేను మెగా ఫ్యామిలీకి చెందిన వాడిని అని నేను చెప్పుకోలేదు. కేరింత ఆడిషన్‌కు వెళితే దిల్ రాజు నాకు పిల్ల నీవు లేని జీవితం సినిమా అవకాశం ఇచ్చారు.
టాలీవుడ్‌లో చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు బ్రాండ్ ఉంది. దానిని పెద్దగా వాడుకోలేదు. నేనెవరో తెలియకుండానే నాకు మొదటి సినిమా అవకాశాన్ని వైవీఎస్ చౌదరీ ఇచ్చాడు. నేనెప్పుడు మెగా ఫ్యామిలీ పేరును పెద్దగా ఉపయోగించుకోలేదు.
సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తే మనోనిబ్బరంగా ఎలా ఉండాలో అమ్మ నేర్పింది. మామయ్యాలు అండగా నిలిచారు.
అమ్మ పెళ్లి చేసుకోమ్మని పోరు పెడుతున్నది. కానీ నేను చేసుకోలేనని చెప్పాను. నా చిన్నతనం, యుక్త వయస్సులో నేను కోల్పోయిన క్షణాలను అనుభవించాలి. అమ్మతో గడుపలేకపోయిన సమయాన్ని ఇప్పడు నేను అనుభవించాలి. అవన్నీ తీరిన తర్వాతనే నేను పెళ్లి చేసుకోంటాను అని చెప్పాను.
నా చిన్నతనంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. మా అమ్మ కెరీర్‌ను మా కోసం త్యాగం చేసింది. మేము ఎక్కడ చెడిపోతామో అని భయంతో మాకోసమే తన సమయాన్ని కేటాయించింది. అందుకే నాకు మా అమ్మ అంటే ఇష్టం. అమ్మతో గర్ల్‌ఫ్రెండ్ గురించి చెబుతాను. పార్టీలో తాగే విషయాన్ని చెబుతాను.
నేను డిగ్రీ చదువుకునేటప్పుడే ఉద్యోగం చేసేవాడిని. సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పడితే నష్టం వచ్చింది. ఓదశలో డబ్బులు లేకుండా బతికాను.