Jerusalem Mathaiah, one of the prime accused in cash-for-vote scam involving Telugu Desam Party legislator A Revanth Reddy, has claimed that KCR and Chandrababu are trying to book him in case
అప్పట్లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు.. ఆ తర్వాత మారుతూ వచ్చిన రాజకీయ సమీకరణాల రీత్యా తెరమరుగవుతూ వచ్చింది. రాజకీయాలు అసలు నిందితులను తప్పిస్తే.. మధ్యవర్తిగా ఉన్న తానే దోషిగా ఇరుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని నిందితుడు జెరూసలెం మత్తయ్య వాపోతున్నాడు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. పార్టీ ఇన్ పర్సన్ (న్యాయవాదితో సంబంధం లేకుండా)గా ఈ కేసులో హాజరయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరడం గమనార్హం. కోర్టు నుంచి బయటకొచ్చిన అనంతరం మత్తయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు గంట గంటకు, రోజు రోజుకు వచ్చి అప్‌డేట్స్ ఇచ్చినవాళ్లు.. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే లేదు. నాతో మాట్లాడిన ఏపీ టీడీపీ ప్రభుత్వం గానీ, తెలంగాణ పోలీసులు గానీ కేసు గురించి ఏ సమాచారమూ ఇవ్వట్లేదు. హైకోర్టులో కేసు క్వాష్ అయ్యేవరకు నాతో ఉన్నవాళ్లు ఈరోజు సుప్రీంకోర్టుకు వస్తే కనీసం వాయిదా డేట్ గురించి చెప్పడం లేదు.
వారెంట్ జారీ అయితే నేను, నా కుటుంబ సభ్యులు జైలు పాలయ్యే కుట్ర చేస్తున్నారా? అన్న భయం వెంటాడుతోంది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఏకమై ఇదంతా చేయిస్తున్నారేమోనన్న ఆందోళన ఉంది. అందుకే పార్టీ ఇన్ పర్సన్‌గా నేను హాజరై జరిగిన వాస్తవాలన్నీ కోర్టు ముందు పెడుతా, ఆ ఇద్దరి ప్రతీకారాలకు నన్నెలా వాడుకున్నారో వివరిస్తా. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా.
ఓటుకు నోటు కేసులో రేవంత్ డబ్బులతో పట్టుబడ్డ నాటి నుంచి.. గత 2017 జూన్ వరకు వాళ్ల లాయర్లు నాతో టచ్ లో ఉన్నారు. కానీ గత ఆర్నెళ్ల నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం లేదు. 23వ తేదీన వాయిదా ఉందని మీడియా ద్వారా తెలుసుకుని ఢిల్లీకి వచ్చా. వాయిదాకు రాకపోతే వారెంట్ జారీ అయి ముద్దాయికి శిక్ష పడుతుందని వచ్చాను. కేసులో తటస్థంగా ఉన్నవారి సాక్ష్యం కావాలని చెప్పి నన్ను సాక్షిగా పెట్టారు. అందుకు నేను ఒప్పుకోలేదు. హైకోర్టు కూడా నాకు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది.