At the AIADMK party headquarters, the Chief Minister E. Palanisamy and the Deputy Chief Minister O. Panneerselvam will unveil the statue of the late Chief Minister Jayalalithaa
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 70 జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తమిళనాడుతో సహ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జయలలిత జయంతి వేడుకలను అమ్మ అభిమానులు నిర్వహించారు. జయలలిత జయంతి సందర్బంగా అన్నాడీఎంకే పార్టీ ప్రచారం కోసం ఏర్పాటు చేసిన నమదు పురచ్చి తలైవి అమ్మ అనే దినపత్రికను తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రారంభించారు. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జయలలిత నిలువెత్తు జయలలిత కాంస్య విగ్రహాన్ని పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆవిష్కరించారు.
జయలలిత జయంతి సందర్బంగా రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం ఆ పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది అమ్మ అభిమానుల సమక్షంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం జయలలిత నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
జయలలిత జయంతి వేడుకల సందర్బంగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం బిజీబిజీగా గడుపుతున్నారు. తీరకలేని కార్యక్రమాలలో సీఎం, పన్నీర్ తో పాటు మంత్రులు పాల్గొంటున్నారు.