While Virat Kohli has made it a habit of breaking broken records, Mahendra Singh Dhoni got his name in the record books recently for most dismissal in the T20 format. The former skipper is ready to add one more record to his illustrious career.
మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 శనివారం రాత్రి 9.30 గంటలకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిలను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో 17 పరుగులు చేస్తే టీ20ల్లో 2000 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిదే. టీ20ల్లో ఇప్పటి వరకు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే రెండు వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరూ న్యూజిలాండ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. మూడో టీ20లో కోహ్లీ మరో 17 పరుగులు చేస్తే రెండు వేల పరుగులు మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్ అవుతాడు.
మార్టిన్ గుప్టిల్ 75 మ్యాచ్‌ల్లో 2,271 పరుగులు సాధించగా, బ్రెండన్ మెక్‌కల్లమ్ 71 మ్యాచ్‌ల్లో 2,140 పరుగులతో ఈ ఘనత సాధించాడు. కివీస్ బ్యాట్స్‌మెన్లు ఇద్దరూ టీ20ల్లో రెండేసి సెంచరీలు చేశారు. అయితే టీ20ల్లో కోహ్లీకి సెంచరీ చేసే అవకాశం రాలేదు. టీ20ల్లో కోహ్లీ ఇప్పటి వరకు 18 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు.
ప్రస్తుతం కోహ్లీ 57 టీ20ల్లో 1,983 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ సిరిస్‌లో కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరనుంది. ఇంకా 129 పరుగులు సాధిస్తే ఒక పర్యటనలో వెయ్యి పరుగుల్ని సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. గతంలో విండిస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ ఒక్కడే ఒక పర్యటనలో వెయ్యి పరుగుల్ని పూర్తి చేసిన క్రికెటర్‌గా ఉన్నాడు.