BJP's Second Thoughts On YS Jagan

Oneindia Telugu 2018-02-28

Views 482

Reports that the BJP could consider an alliance with the YSR Congress have, according to BJP leaders, left the TDP leadership worried. “Such reports seemed to have made the TDP soften its hard stand,” said a leader from the state.

ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మరోసారి గట్టిగా చెబుతున్న ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరికైనా, ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరిగితే దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లే బాధ్యత వహించాలన్నారు. ఈ రెండు పార్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించకుంటే దేశానికి మంచిది కాదన్నారు. చంద్రబాబు క్రమంగా స్వరం పెంచడాన్ని బీజేపీ గమనిస్తోంది. ఆయన వ్యాఖ్యల గూడార్థం ఏమిటని కొందరు బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. అంటే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా లేక ఏపీ కోసమా అనే చర్చ సాగుతోందట. విడతలవారీగా ఇస్తున్నప్పుడు స్వరం ఎందుకు పెంచుతున్నారని చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు రూటు మార్చారా? లేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు దగ్గర కావాలంటే బీజేపీతో ప్రస్తుతానికి దూరం జరగడమే మంచిదని భావిస్తున్నారా? ఆయన మనసులో ఏముందనే అంశంపై బీజేపీలో చర్చ సాగుతోందని తెలుస్తోంది.
2019లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తమకు దూరం జరగాలనుకుంటే.. అనే ఆలోచనలో ఉన్న బీజేపీ.. వైసీపీతోను చర్చలు జరుపుతోందనే ప్రచారం సాగుతోంది. ఏపీకి చెందిన కొందరు బీజేపీ నేతల మనసుల్లో తమతో కాకుండా, వైసీపీతో జత కట్టాలని భావిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కూడా చెబుతున్నారు.
టీడీపీ దూరమైతే వైసీపీని చేర్చుకోవాలని బీజేపీ భావిస్తుండవచ్చు. వైసీపీకి కూడా ప్రస్తుతానికి కేసులు, ఇతర ఇబ్బందుల దృష్ట్యా ఎన్డీయేలో చేరాలని భావించవచ్చు. కానీ ఏ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు బీజేపీకి గుడ్ బై చెబుతున్నారో... దానిని వైసీపీ పక్కన పెడితే ఆ పార్టీకి నష్టం. కాబట్టి బీజేపీ, వైసీపీలు కలిసి కాకుండా ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందని, ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరే ఆలోచన చేస్తుందని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS