Hardik Pandya Needs To Improve His Batting | Oneindia Telugu

Oneindia Telugu 2018-03-02

Views 32

Pandya, after his 93 in the first Test against South Africa in Cape Town, failed to get a single half-century across formats in the remaining matches.

ప్రస్తుత టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాలని మాజీ ఆల్‌రౌండర్, భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ సూచించారు. అతను మంచి ఆటగాడే కానీ, అతని నుంచి ఎక్కువగా ఆశిస్తుండటంతో ఒత్తిడి పెరిగి ఆడలేకపోతున్నాడు.
ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా పర్యటనలో మొదటి ఇన్నింగ్స్ ఆడి 93 పరుగులు చేసిన పాండ్యా మరే ఇన్నింగ్స్ లోనూ అంతగా రాణించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశాడు. ‘పాండ్యాలో ప్రతిభ, సామర్థ్యాలకు కొదవలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో వాటిని చూపించాడు కూడా. వేరొకరితో పోల్చినపుడు అతడిపై ఒత్తిడి పెరుగుతుందనే మాట నిజమే. దానికి బదులు అతడు సహజ సిద్ధమైన ఆట ఆడితే బాగుంటుంది. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి మరింత మెరుగుపడితే మంచిది' అని సూచించాడు.
ఆల్‌రౌండర్లు కూడా రెండింటిలో ఏదైనా ఒక విభాగంలో అత్యుత్తమంగా ఉండాల్సిందే ఎందుకంటే నా దృష్టిలో పాండ్యా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. నేను అతడిని అలాగే చూడాలనుకుంటున్నా.' అని అన్నారు. ‘మనం అతడి నుంచి ఎక్కువగా ఆశిస్తున్న మాట వాస్తవమే... కానీ ఆ సామర్థ్యం పాండ్యాలో ఉంది. ప్రస్తుత జట్టులో అతడో ఉత్తమ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు' అని అన్నారు.
మరో వైపు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయావకాశాల గురించి మాట్లాడుతూ...‘కోహ్లి దూకు డు, ధోని ప్రశాంతత కలగలిస్తే మన జట్టుకు మంచి చాన్స్‌ ఉంటుంది' అని కపిల్‌ అభిప్రాయపడ్డారు.

Share This Video


Download

  
Report form