KCR Remarks On Modi : KCR Third Front Plans

Oneindia Telugu 2018-03-03

Views 336

Reports said that KCR is planning to form a Third Front at the Centre, with parties that are dissatisfied with either present National Democratic Alliance (NDA) or Opposition United People's Alliance (UPA).

బీజేపీకి మిత్రపక్షం కాకపోయినప్పటికీ.. ఒకానొక దశలో అంతకంటే ఎక్కువగానే వ్యవహరించారు కేసీఆర్. నోట్ల రద్దు సమయంలో ప్రాంతీయ పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం సమర్థించారు. జీఎస్టీ విషయంలోనూ.. తొలుత సమర్థించి ఆపై మాట మార్చారు. ఇలా బీజేపీతో ఆచీ తూచీ వ్యవహరిస్తూ వస్తున్న కేసీఆర్.. ఇప్పుడు మాత్రం తిరగబడడానికే సిద్దమైనట్టు కనిపిస్తోంది.
జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని కేసీఆర్ మొన్నామధ్య చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆయన అటువైపుగా మళ్లుతున్నట్టు చెబుతున్నాయి. ప్రధాని మోడీపై ఘాటైన విమర్శల వెనుక ఇదే కారణం ఉన్నట్టు అనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ 'ఫెడరల్ ఫ్రంట్' ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న జాతీయ పార్టీలపై తిరుగుబాటుకు ఆయన పక్కా ప్రణాళికతో సిద్దమవుతున్నట్టు సమాచారం.
కేసీఆర్ ఇటీవలి ఢిల్లీ పర్యటన 'ఫెడరల్ ఫ్రంట్' ప్రయత్నాలకు ఊతమిచ్చింది. దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి?.. ఎలా మారబోతున్నాయి? అన్నదానిపై ఒక అంచనాకు వచ్చిన కేసీఆర్.. ఢిల్లీలో సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులతో దీనిపై చర్చించినట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలన్ని జట్టుకడితేనే జాతీయ పార్టీల పెత్తనాన్ని నిలువరించవచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనే కాదు.. ఆ దిశగా కేసీఆర్ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా) అధినేత శిబూసోరేన్, తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ నేత అఖిలేశ్ యావవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(జేడీఎస్)లతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియరానప్పటికీ.. మరికొంతమంది ప్రాంతీయ పార్టీల అగ్రనేతలతోనూ ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనపై వారు స్పష్టమైన అభిప్రాయం చెప్పనప్పటికీ.. వ్యతిరేకత మాత్రం కనబర్చలేదని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS