Sunny Leone's Twin Boys

Filmibeat Telugu 2018-03-05

Views 1

Sunny and Daniel have expanded their brood and are also parents to twin boys. The actress took to Instagram to make the announcement, along with a picture of their complete family.

ఎన్నో ఏళ్లుగా తల్లి కావాలని తపిస్తున్న బాలీవుడ్ సెక్స్‌బాంబ్ సన్నీలియోన్ కోరిక నెరవేరింది. సన్నీలియోన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. దాంతో డేనియర్ వెబర్, సన్నీలియోన్ ఆనందంలో మునిగిపోయారు. సరోగసి ద్వారా తమకు కవల పిల్లలు జన్మించారని సన్నీలియోన్ సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

ఇద్దరు కవల పిల్లలతోపాటు దత్త పుత్రికతో సన్నీ దంపతులు ఫోటో దిగి ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది మా సంపూర్ణ కుటుంబం అని సన్నీ పేర్కొన్నది. కవల పిల్లలకు ఆషెర్ సింగ్ వెబర్, నో సింగ్ వెబర్ అని నామకరణం చేశారు.

మీరు ఏం కంగారు పడవద్దు. ఆషెర్, నో ఇద్దరు మాకు జన్మించిన పిల్లలే. చాలా ఏళ్లక్రితం సరోగసి ద్వారా పిల్లల్ని కనాలని అనుకొన్నాం. ఆ కార్యక్రమం ఇప్పుడు దిగ్విజయంగా పూర్తయింది. కవల పిల్లలు జన్మించడం మాకు ఓ వరంగా భావిస్తున్నాం అని సన్నీలియోన్ ట్విట్టర్‌లో పేర్కొన్నది.

కొద్దివారాల క్రితమే మాకు కవలలు జన్మించినప్పటికీ.. ఎన్నో ఏళ్లుగా మా హృదయాలలో, మా కళ్లలో ఉన్నారు. మాకు మంచి కుటుంబాన్ని ఇవ్వడానికి భగవంతుడు ఇలా ప్లాన్ చేశాడు. ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులుగా మేము గర్విస్తున్నాం. అందరికీ ఈ వార్త ఆశ్చర్యాన్ని కలిగించడం తథ్యం అని సన్నీలీయోన్ వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS