Best Actor for Oscars 2018 is Gary Oldman. Best actress is Frances McDormand
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కొనసాగుతోంది. అద్భుత చిత్రాలన్నీ ఆస్కార్ బరిలో నిలిచి అవార్డుని సొంతం చేసుకుంటున్నాయి. దర్శకుల ప్రతిభ, నటుల ప్రతిభ, సాంకేతిక విభాగం ఇలా అన్ని విభాగాల్లో ఆస్కార్ అవార్డుని ఎంపిక చేసారు. విజువల్ ఎఫెక్ట్స్ లో బ్లేడ్ రన్నర్ చిత్రం సత్తా చాటి ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా గ్రే ఓల్డ్ మాన్, ఉత్తమ నటిగా 60 ఏళ్ల ఫ్రాన్సెస్ మెక్ డార్మెన్డ్ ఆస్కార్ గెలుపొందారు.
ఉత్తమ విదేశీ చిత్రంగా 'ఎ ఫాంటాస్టిక్ వుమన్ ' (చిలి) ఆస్కార్ కైవసం చేసుకుంది. టాన్యకు చెందినా 58 ఏళ్ల అలిసన్ జెన్నీ ఉత్తమ్ సహాయ నటిగా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది.
డియర్ బాస్కెట్ బాల్ చిత్రానికి ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ దక్కింది.
ఉత్తమ యానిమేషన్ ఫీచర్ చిత్రంగా కోకో చిత్రం అవార్డు దక్కించుకుంది.
విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో బ్లేడ్ రన్నర్ 2049 చిత్రం ఆస్కార్ సొంతం చేసుకుంది.
ఉత్తమ ఎడిటర్ : లీ స్మిత్... doneకిర్క్ చిత్రానికి ఆస్కార్ కైవసం చేసుకున్నారు.