Lenin statue in Tripura's brought down after BJP's win

Oneindia Telugu 2018-03-06

Views 257

A statue of Vladimir Lenin was brought down at Belonia College Square in Tripura’s Agartala on Monday.
త్రిపురలో కమ్యూనిస్ట్ ఐకాన్ లెనిన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. త్రిపురలోని బెలోనియా నగరంలో ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. త్రిపుర ప్రజలు కమ్యూనిస్ట్ పాలనకు చరమగీతం పాడి బీజేపీ కూటమిని గెలిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుదారులే ఈ చర్యకు పాల్పడ్డారని లెఫ్ట్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

లెనిన్ విగ్రహాన్ని జేసీబీతో కూల్చేశారు. కూల్చివేసే సమయంలో భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు. బీజేపీ మద్దతుదారులే ఈ చర్యకు పాల్పడ్డారని సీపీఎం నేతలు ఆరోపించారు.

మరోవైపు, 25 సంవత్సరాల పాటు లెఫ్ట్ నేతలు రాష్ట్రాన్ని పాలించారని, ఆ విగ్రహాన్ని ప్రజలు కూల్చేశారని, లెఫ్టిస్ట్‌లు బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారనడానికి ఇది నిదర్శనం అని బీజేపీ నేతలు అన్నారు. లెనిన్ విగ్రహాన్ని బీజేపీ మద్దతుదారులు కూల్చేశారని, ఆ తలతో ఫుట్‌బాల్ ఆడుకున్నారని తమకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని బెలోనియా సబ్ డివిజన్ సెక్రటరీ సీపీఐ(ఎం) నేత తపస్ దత్తా ఆరోపించారు. లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిన జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను బెయిల్ పైన విడుదలయ్యాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Share This Video


Download

  
Report form