As It is a known fact that Mahesh Babu's Bharath Ane Nenu movie and Allu Arjun's Naa Peru Surya are all set to compete with each other at the box office for this summer. Babu's Bharath Ane Nenu movie drags the political darma in telugu states and Naa Peru Surya screens about the India army in Boder.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. తొలిసారి మహేష్ బాబు ఇలాంటి పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మిలటరీ ఆపరేషన్, దేశభక్తి నేపథ్యంలో రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలు అద్భుతమైన కథలతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. భరత్ అనే నేను చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్ లో మహేష్ పేల్చినా డైలాగ్స్ ఓ ఎత్తైతే, ముఖ్యమంత్రిగా మహేష్ కిల్లింగ్ లుక్స్ మరో ఎత్తు. కొరటాల రూపొందిస్తున ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంలో ఆర్మీ మాన్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో విడువులైన టీజర్ లో బన్నీ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు బలంగా ఉన్నట్లు అర్థం అవుతోంది.
ఈ రెండు చిత్రాలు బలమైన కథలతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నేపథ్యంలో కొరటాల శివ భరత్ అనే నేను చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా మలచబోతున్నారు. ఇక ఆర్మీ మాన్ గా అల్లు అర్జున్ బోర్డర్ లో చేసే సాహసాలతో నా పేరు సూర్య చిత్రం ఉండబోతోంది. భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న, నా పేరు సూర్య చిత్రం మే 4 న ఘనమైన విడుదలకు సిద్ధం అవుతున్నాయి