టీడీపీ, వైసీపీ లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్, 48గంటల డెడ్‌లైన్....!

Oneindia Telugu 2018-03-16

Views 2K

Janasena Party president Pawan Kalyan fired at TDP and YSRCP for no confidence motion issue. and Pawan Kalyan sets 48 hours Time to AP government over Guntur Cholera issue

అతిసారా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే గుంటూరు బంద్‌కు పిలుపునిస్తానని, అవసరమైతే దీక్షకు దిగుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కలుషిత నీటిని తాగడం వల్ల అతిసారా(డయేరియా)తో బాధపడుతూ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. చనిపోయిన వారిని తీసుకురాలేం, దీనికి ఎవరు బాధ్యులు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో 14మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శుద్ధమైన తాగునీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందని పవన్ నిలదీశారు. ‘మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా? ఇక్కడి ప్రజాప్రతినిధులకు సమస్యలు పట్టవా?' అని పవన్ మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రావాలని, రానంటే కుదరదని పవన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు తనకుందని అన్నారు.
అవిశ్వాస తీర్మానంపై స్పందిస్తూ.. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు అవిశ్వాసంపై స్పష్టత లేదని పవన్ అన్నారు. అవిశ్వాసంపై ఇంత గందరగోళం ఎందుకని ప్రశ్నించారు. హడావుడిగా అవిశ్వాస తీర్మానాలు ఎందుకని నిలదీశారు.
తాను 5వ తేదీన అవిశ్వాసం పెట్టాలని సూచిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ మార్చి 23న పెడతామని చెప్పిందని.. ఇప్పుడేమో మాట మార్చిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన తేదీని ఎందుకు మార్చాల్సి వచ్చిందని పవన్ ప్రశ్నించారు. అవిశ్వాసంపై ఎందుకంత అయోమయానికి గురవుతున్నారని అన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS