Shami–Jahan Controversy : She Hidden Her First Marriage Says Shami

Oneindia Telugu 2018-03-16

Views 224

Mohammed Shami and his wife Hasin Jahan controversy , the cricketer has now claimed that he was unaware of Jahan’s first marriage when the couple was married in 2014.

వ్యక్తిగతంగా, వృత్తిగతంగా దిగజార్చే యత్నం చేస్తున్న భార్య హసీన్ జహాన్ గురించి తాజాగా షమీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో షమీ మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఉరి తీయమని చెప్తున్నాడు. భారత జట్టుకు ద్రోహం చేశానంటూ ఆరోపణలు వస్తున్న విషయంలో భార్యపై తీవ్రంగా మండిపడ్డాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన షమీ భార్యపై విమర్శలు సంధించాడు.
హసీన్ మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి తనను రెండో పెండ్లి చేసుకుందని వాపోయాడు. తన పిల్లలను సైతం చెల్లి పిల్లలంటూ చెప్పుకొచ్చిందని తెలిపాడు. ఇప్పటికీ ఈ విషయంలో తన తల్లిదండ్రులు అబద్దాన్నే నమ్మతున్నారని వివరించాడు. షాపింగ్ కోసం డెబిట్ కార్డును విచ్చలవిడిగా వాడేదని, దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు వజ్రాలు, బంగారం తీసుకురమ్మని చెప్పేదని ఆరోపించాడు. అయినా సరే పరిస్థితి ఇంతదాకా వచ్చిన తర్వాత ఇకపై కలిసి జీవించడం కుదరదని తేల్చేశాడు.
ఒకవేళ నేను తప్పు చేసినట్లు రుజువైతే నన్ను ఉరి తీయండి. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను దేశానికి ఎప్పుడూ ద్రోహం చేసే వ్యక్తిని కాదని' షమీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Share This Video


Download

  
Report form