Train services was badly affected in Mumbai during rush hour on Tuesday as hundreds of students demanding railway jobs sat on the rail tracks in the centre of the city.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రైల్వేలో ఉద్యోగాలను డిమాండ్ చేస్తూ నగరంలోని రైల్వే ట్రాక్‌పై కూర్చుని వందలాది మంది విద్యార్థులు నిరసన ప్రదర్శనకు దిగారు. దాంతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. రైల్వే అప్రెంటిస్ పరీక్ష పాసైన విద్యార్థులు మాతుంగ, ఛత్రపతి శివాీ టెర్మినల్ స్టేషన్లకు మధ్య మంగళవారం ఉదయం 7 గంటల నుంచి నిరసన ప్రదర్శనకు దిగారు. దాంతో సబర్బన్ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.
స్థానిక రైళ్ల రాకపోకలకు మాత్రమే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లపై కూడా దీని ప్రభావం పడింది. నిరసనకారులపై పోలీసులు బటోన్స్ వాడినట్లు తెలుస్తోంది. స్థానిక రైళ్లపై విద్యార్థులు రాళ్లు విసిరినట్లు సమాచారం. కాగా, అప్రెంటిస్‌లకు ఉద్యోగాలు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని, ప్రత్యేకమైన కాలానికి మాత్రమే వారు శిక్షణ తీసుకున్నారని, కొన్ని ఉదయోగాలు వారికి కేటాయించామని రైల్వే అధికారులు అంటున్నారు. అయితే, 20 శాతం కోటా పరిమితిని ఎత్తేసి, పూర్తి కోటాను తమతో భర్తీ చేయాలని విద్యార్థులు అంటున్నారు.