Dhoni & Dinesh Karthik Are Both In One Race During Selection

Oneindia Telugu 2018-03-22

Views 197

Sundeep Patil Gives Clarity On The Happend Thing On Selection Process Between Dhoni & Dinesh Karthik

వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ మంచి ప్రత్యామ్నాయమే అయినప్పటికీ, ధోనినే తన తొలి ప్రాధాన్య వికెట్‌కీపర్ అని టీమిండియా మాజీ సెలక్టర్ సందీప్ పాటిల్ వెల్లడించాడు. 2004లో జింబాబ్వే పర్యటన సందర్భంగా వీరిద్దరిలో ఒక్కరినే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు తాను కార్తీక్‌వైపే మొగ్గుచూపానని చెప్పాడు.
అప్పుడు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత్‌-ఏ జట్టుకు కోచ్‌‌గా సందీప్ పాటిల్ ఉన్నాడు. ఆ సమయంలో ఛీఫ్ సెలక్టర్‌ సయ్యద్‌ కిర్మాణి ఫోన్ చేసి గాయపడ్డ పార్థివ్‌ పటేల్‌ స్థానంలో ఛాంపియన్స్‌ ట్రోఫీకి ధోని లేదా కార్తీక్‌ పేరును సూచించాలని అడిగాడు. అప్పుడు ఏ జట్టులో ధోని ప్రాధాన్య వికెట్‌కీపర్‌ కాదు. తుది పదకొండు మందిలో కూడా లేడని చెప్పాడు.
'ఆ సాయంత్రం హరారేలో దినేశ్‌ కార్తీక్‌ను నేను హోటల్‌ గదికి పిలిచా. సెలక్టర్ల నుంచి నాకు ఫోన్‌ వచ్చిందని, నీ పేరును సూచించానని చెప్పాను. ఆ తర్వాత ధోనీని కూడా పిలిచా. తన పేరును కాకుండా కార్తీక్‌ పేరును ఎందుకు సూచించాల్సి వచ్చిందో వివరించా. ఏదో ఒక రోజు నీకు కూడా అవకాశమొస్తుందని అన్నాను' అని పాటిల్ తెలిపాడు.
'కార్తీక్‌ సెంచరీ బాదాడు. వికెట్‌ కీపింగ్‌ కూడా చేస్తున్నాడు. అదే సమయంలో ధోని మ్యాచ్‌లు ఆడటం లేదు. ఆ తర్వాత మేం కెన్యా వెళ్లాం. అక్కడ అతడు చెలరేగిపోయాడు' అని పాటిల్ తెలిపాడు. అప్పుడు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కార్తీక్‌ స్థానంలో సరిగ్గా ఏడాది తర్వాత ధోని భారత జట్టులోకి వచ్చాడు.
'అప్పుడు కార్తీక్‌ భిన్నమైన ఆటగాడు. భారత జట్టులో చోటు దొరకగానే, స్ట్రెయిట్‌గా ఆడాలని చాలా మంది ఆటగాళ్లు భావిస్తుంటారు. తమ శైలి మరిచిపోతారు. కార్తీక్‌ విషయంలోనూ అదే జరిగింది. కార్తీక్‌ తనదైన ఆటను తగ్గించుకున్నాడు. ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలు కూడా అతణ్ని ఇబ్బందిపెట్టాయి' అని సందీప్‌ పాటిల్‌ అన్నాడు.

Share This Video


Download

  
Report form